తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు- రంగారెడ్డి(Palamuru-Rangareddy) ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. కృష్ణా నదీజలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో జాతీయ హోదా సాధ్యం కాదని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది.
ఈమేరకు తెలంగాణ రాష్ట్రం పంపిన ప్రాజెక్ట్ టెక్నో ఎకనమిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని లోక్‌సభకు లిఖితపూర్వకంగా తేల్చి చెప్పింది. 2024 డిసెంబర్‌లోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం ఇచ్చింది. దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కపోవడంతో మరోసారి నిరాశే ఏర్పడింది.