Friday, November 22, 2024
HomeతెలంగాణPaleru: స్నేహబంధం.. ఎంత మధురం

Paleru: స్నేహబంధం.. ఎంత మధురం

ఆత్మీయ కలయిక

జీళ్ళచెర్వు ఉన్నత పాఠశాలలో2001-2002 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. స్నేహబంధం, ఎంత మధురమో, తరిగిపోదు. పూర్వ విద్యార్థులు ఓ చోట కలిసి పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. 24 ఏళ్ళ చదువుకున్న పూర్వ విద్యార్థులు అంతా ఒకచోట చేరి ఆత్మీయ పలకరింపులతో యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనందంగా గడిపారు. వారి వారి పిల్లలు కుటుంబ సభ్యులతో పూర్వ విద్యార్థుల హాజరవడంతో పాఠశాల ప్రాణం అంతా పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యులతో నిండిపోయింది. వివిధ వృత్తులు, ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కూడా స్నేహబంధమే ముఖ్యమంటూ ఓచోట కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేద్దామంటూ తోటి విద్యార్థులకు ఉపయోగపడతా మంటూ తీర్మానాలు చేసుకున్నారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కనపెట్టి వినోద కార్యక్రమాల్లో పాల్గొన్న గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. మరొకసారి కలుద్దాం అంటూ ఒకరికొకరు ఆత్మీయ వీడుకోలు చెప్పుకున్నారు. ఆత్మీయ కలయికకు కృషిచేసిన భరత్, హరికృష్ణ, వీరబాబు, పాల్త్య బద్దు, ఆంజనేయులు, సైదులు, స్రవంతి గౌతమి, తదితరులను తోటి విద్యార్థులు అభినందించారు.వాళ్లకు చదువు నేర్పిన గురువులు రాజయ్య,, సీతారాం, అనిత, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు లను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News