Sunday, October 6, 2024
HomeతెలంగాణCheryala: పల్లా ప్రచారానికి ముగ్ధులైన జనం

Cheryala: పల్లా ప్రచారానికి ముగ్ధులైన జనం

నేనున్నా..అంటూ భరోసా

జనగామ బీఆర్ ఎస్ అభ్యర్థి పల్లా కి జనం నీరాజనాలు పడుతున్నారు..విద్య..వైద్యం..ఉపాధి కల్పనే ద్యేయంగా..నియోజకవర్గంలో ప్రజల మనస్సు గెలిచిన నేతగా రాజేశ్వర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన పల్లా ఎన్నికల సమరశంఖం పూరించి గ్రామాల్లోకి వెళ్తున్నాడు.. ఇందులో భాగంగా నియోజక వర్గంలోని కొమురవెల్లి మండలంలోని రసూలబాద్, అయినాపూర్, పోచన్ పల్లి, గురువన్న పేట, తపాసు పల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటన చేపట్టారు…ఇప్పటికే చేర్యాల మండలంలో ప్రచారం ప్రారంభించి ఒక ప్రణాళిక ప్రకారం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.

- Advertisement -

గ్రామానికి వచ్చిన పల్లాకు అపూర్వ స్పందన లభిస్తోంది. ఈ సందర్బంగా ప్రచారం నిర్వహించిన గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి పల్లాకు స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాలు, పూలు చల్లుతూ ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రతి ఒక్కరిని పేరుపేరున ఆప్యాయంగా పలికరించారు..అదే విధంగా వృద్ధులతో ముచ్చటించారు..సమస్యలు తెలుసుకుంటూ..ప్రత్యేక ప్రణాళిక ద్వారా వాటికి పరిష్కారం చూపుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

మూడోసారి కూడా భారీ మెజారీతో పల్లాను గెలిపించి గులాబీ జెండాకు తిరుగులేదని నిరూపించుకోవాలన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పట్టుదలతో పనిచేస్తున్నారు. దీంతో జనగామ నియోజకవర్గంలో గులాబీ జెండా మూడోసారి రెపరెపలాడటం ఖాయమంటూ ప్రజలు, అభిమానులు జై కేసీఆర్..జై పల్లా అంటూ నినాదాలు చేశారు.

వచ్చేది..ఇచ్చేది కేసీఆరే
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులందరికీ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్లు అందుతాయన్నారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా పేరిట రాష్ట్రంలోని అర్హులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా రూ.15 లక్షలకు పెంచనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో లోని ఇలాంటి హామీలను చూసిన ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు.

కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను, మాయమాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా తొమ్మిదిన్నర ఏళ్ల పాటు పనిచేసిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

ఇతర పార్టీల నాయకులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపిస్తారని, తాము మాత్రం నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ ను ఆశీర్వదించాలని కోరారు..కార్ గుర్తుకు ఓటు వేసి తమను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News