Tuesday, December 3, 2024
HomeతెలంగాణPanchayathiraj: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న తెలంగాణ పంచాయతీలు

Panchayathiraj: రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న తెలంగాణ పంచాయతీలు

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులు అందుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, అధికారులు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన పంచాయత్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు.

- Advertisement -

కేంద్రం ప్రకటించిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో 13 అవార్డులు గెలుచుకున్న తెలంగాణ రాష్ట్రం, 8 దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు సొంతం చేసుకోవటం విశేషం.  5 నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు, 9 కేటగిరిలలో అవార్డుల ఎంపిక జరగగా, 8 కేటగిరీలలో తెలంగాణ రాష్ట్రం అవార్డులు సాధించటం విశేషం.

దేశంలో ప్రతి అంశంలోనూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకుంది తెలంగాణ రాష్ట్రం.  అత్యధిక అవార్డులు సాధించిన తెలంగాణను రాష్ట్రపతి అభినందించారు. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు తీసుకోవడం పట్ల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  రాష్ట్రంలో సీఎం కెసిఆర్ వల్ల జరుగుతున్న పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను సందర్భంగా ఆయన వివరించారు.

ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందనలు

అవార్డులు ఇచ్చిన కేంద్రానికి, రావడానికి కారణమైన సీఎం కెసిఆర్, మంత్రులు కే టి అర్, హరీశ్ రావు లకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పంచాయతీలకు సూచించారు.   అంతకుముందు, అవార్డు గ్రహీతలకు తేనీటి విందు ఇచ్చారు కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్, కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సునీల్ కుమార్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రజా ప్రతినిధులు, ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్రానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీతలు, అధికారులు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News