యువత భవిష్యత్తు అంతా బిఆర్ఎస్ పార్టీతోనే ఉందన్నారు చల్లా ధర్మారెడ్డి. బిఆర్ఎస్ పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ గ్రామంలోని బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు యువకులను గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి చూసే పార్టీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఓటు తప్పు చేస్తే భవిష్యత్ తరాలు ఇబ్బందుల్లో పడతామన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే కెసిఆర్ చేతులను బలోపేతం చేయండని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డి గతంలో నర్సంపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయిన విధంగానే ఇప్పుడు కూడా ఇక్కడ ఓటమిపాలవడం తథ్యమని ఆయన అన్నారు. పరకాల నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించి మరోమారు అభివృద్ధి దిశలో కొనసాగే విధంగా తోడుండాలని అభ్యర్థించారు.
పార్టీలో చేరిన వారిలో..కొత్త సుధాకర్,కొడెపాక బాబు,కొత్త సుమన్,పోలేపాక హరీష్,కొత్త కార్తిక్ లతో పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బి.ఆర్.ఎస్. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Parakala: యువత భవిష్యత్ అంతా బిఆర్ఎస్ పార్టీతోనే ఉంది
రేవూరి ప్రకాష్ రెడ్డికి ఓటమి తథ్యం