Keesara Kidnap Case: తెలంగాణ కీసర ప్రాంతంలో సంచలనాత్మకంగా జరిగిపోయిన కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్టులు బయటకు వస్తున్నాయి. నర్సంపల్లి గ్రామానికి చెందిన శ్వేత, ఇటీవలే ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె భర్త ప్రవీణ్‌తో కలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అయితే శ్వేత తల్లిదండ్రులు వారి ప్రేమ వివాహాన్ని అంగీకరించకుండా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో కోపంతో శ్వేతను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
కేసులో సంబంధం ఉన్న ఆరుగురు వ్యక్తులను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్వేతను తల్లిదండ్రులు అత్తవారి ఇంట్లోకి చొరబడి బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకోబోయిన అత్త కుటుంబ సభ్యులను కూడా చితకబాదారు. శ్వేత భర్త ప్రవీణ్, మామ అత్త కుటుంబ సభ్యులతో కలిసి పోలీసుల సహాయం కోరారు. శ్వేత ఆచూకీ తెలియనప్పటికీ, ఆమె క్షేమంగా ఉన్నట్లు పోలీసులు ఆమె తండ్రితో ఫోన్‌లో మాట్లాడి ధృవీకరించుకున్నారు.
కిడ్నాప్ ఘటనపై శ్వేత భర్త ప్రవీణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రెండు టీమ్‌లుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. శ్వేత అత్తామామలు, భర్త ప్రవీణ్ సమక్షంలో తమ కోడలిని అప్పగించాలని బాధిత కుటుంబం పోలీసులు కోరారు. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ శ్వేత భర్త, అత్తమామలు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట బైటాయించారు. దీంతో పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబసభ్యుల ధర్నాలు క్రిమినల్ చర్యలకు దారితీస్తున్నట్లు వెల్లడైంది. శ్వేత స్తితిగతులు స్పష్టంగా తెలియాల్సి ఉంది.


