Saturday, November 23, 2024
HomeతెలంగాణParigi Indian Navy project: పరిగిలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు పనులు

Parigi Indian Navy project: పరిగిలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు పనులు

ఫిబ్రవరిలో ప్రారంభం

పరిగి నియోజకవర్గం దామగుండం దేవాలయం ప్రాంతంలో దేవాలయానికి, పర్యావరణానికి ఎలాంటి హాని, ఇబ్బంది కలుగకుండా అదే స్థలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీ ప్రాజెక్టు లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

- Advertisement -

నేవి కమండర్ కార్తిక్ శంకర్ బృందం, పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డి, సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. నేవి కమండర్ కార్తిక్ శంకర్- లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ గురించి ముఖ్యమంత్రికి వివరించారు. నావికా దళంకు చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారని, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నేవి కమాండర్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి పరిగి ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని నేవి అధికారులతో సమన్వయము చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ సిబ్బంది సందీప్ దాస్, రాజ్ బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News