Indian Achievers Award: పర్వ్యూ గ్రూప్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ రాజా చిట్టూరికి అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. “ఇండియన్ అచీవర్స్ అవార్డు – ఆఫ్ ది ఇయర్ 2025” పురస్కారం లభించింది. ఈ గౌరవాన్ని ఇండియన్ అచీవర్స్ ఫోరం (IAF) ప్రదానం చేసింది. ఒక దశాబ్దానికి పైగా సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అత్యుత్తమ వృత్తిపరమైన విజయాలు, దూరదృష్టి గల నాయకత్వం, వివిధ రంగాల్లో ఆయన చేసిన విలక్షణ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు.
అభినందించిన బండి సంజయ్: పర్వ్యూ గ్రూప్ సంస్థల్లో సమానత్వం, సమగ్రత సంస్కృతిని నెలకొల్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి వృత్తిపరంగానే కాక, సామాజిక సేవ, విద్యా రంగాల్లో విశేష కృషి చేశారు. యువ సాధికారత , గ్లోబల్ కార్పొరేట్ సహకారంలో అద్భుతమైన కృషికి గాను, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆయనను ప్రత్యేకంగా సత్కరించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహా అనేకమంది ప్రముఖులు ఆయన నిబద్ధతను ప్రశంసించారు. డిసెంబర్ 2025లో లండన్‌లో జరగనున్న అంతర్జాతీయ హెచ్‌ఆర్ సమావేశంలో మానవ వనరుల నాయకత్వంపై డాక్టర్ కుమార్ రాజా చిట్టూరి ప్రధాన ప్రసంగం చేయనున్నారు.



