Saturday, October 12, 2024
HomeతెలంగాణPatancheru: విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్ వల్లూరి క్రాంతి

Patancheru: విద్యార్థులకు పాఠాలు చెప్పిన కలెక్టర్ వల్లూరి క్రాంతి

రాత్రి బస కార్యక్రమంలో భాగంగా..

రాత్రి బస కార్యక్రమంలో భాగంగా పటాన్చెరు మండలం చిట్కుల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కలెక్టర్ పాఠాలు చెప్పారు. గణితంకు సంబంధించిన లెక్కలను 10వ తరగతి విద్యార్థినీలకు వివరించారు. పాఠంలో విద్యార్థులకు సందేహాలు ఉంటే నివృత్తి చేశారు. విద్యార్థినిలు క్రమశిక్షణతో చదివి జిపిఏ సాధించాలన్నారు. ప్రభుత్వము అన్ని రకాల వసతులు మీకు కల్పిస్తుందన్నారు.

- Advertisement -

అనంతరం విద్యార్థినిలతో కలసి బస చేశారు..

పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి బోధన ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలోని తరగతి గదులు, డార్మెటరీ హాల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. రాత్రి మొత్తం విద్యార్థులతో గడిపి నిద్రించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అభివృద్ధి అధికారి దేవుజ, తహసిల్దార్ రంగారావు ఎంపీడీవో ఎంపీవో హరిశంకర్ గౌడ్ మండల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News