రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధ పడకూడదన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించారని, గురువారం నుండి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రారంభంకానున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాట్లపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని స్థాయిల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోజూ ప్రతి గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన శిబిరంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు, అవసరమైన వారికి తక్షణమే నాణ్యమైన రీడింగ్ గ్లాసెస్ అందించడంతో పాటు, ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమైన వారికి రెండు వారాలలో ఇస్తామన్నారు.
ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్టు మహిపాల్ రెడ్డి తెలిపారు.