Wednesday, May 28, 2025
HomeతెలంగాణPatancheru: ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

Patancheru: ఘనంగా సీఎం పుట్టినరోజు వేడుకలు

పటాన్ చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పట్టణ, మండల కేంద్రాలు, ఆయా గ్రామాలలో కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రం జిన్నారంలో వనదుర్గా మాత ఆలయంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ వెంకటేశం గౌడ్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కస్తూర్బా బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి సతీమణి గూడెం కల్పన మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News