Sunday, July 7, 2024
HomeతెలంగాణPatancheru: మే డే వేడుకలను విజయవంతం చేయండి

Patancheru: మే డే వేడుకలను విజయవంతం చేయండి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని మే 1వ తేదీన రామచంద్రపురం డివిజన్ పరిధిలోని లక్ష్మీ గార్డెన్స్ లో భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బి ఆర్ టి యు) అధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి మే డే వేడుకలు నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ అధ్వర్యంలో మే డే వేడుకల పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరుందిన పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నామని తెలిపారు. కార్మికులకు ప్రభుత్వం తరఫున అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించిన మూలంగా.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు..కార్మికులు ఓటీలు చేసుకునే పరిస్థితిలు ఏర్పడ్డాయని తెలిపారు. నూతన పారిశ్రామిక విధానం మూలంగా.. ప్రపంచ స్థాయి పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని అన్నారు. వీటితోపాటు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, క్యాజువల్ కార్మికులకు సైతం మెరుగైన జీతభత్యాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సైతం ఆరు లక్షల రూపాయల ప్రమాద బీమాను ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ పరిశ్రమలలో కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలను చేసిన ఘనత బి ఆర్ టి యు కే దక్కిందని అన్నారు.

కార్మిక దినోత్సవం రోజున నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రతి పరిశ్రమ నుండి కార్మికులు భారీ సంఖ్యలో హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర నాయకులు వరప్రసాద్ రెడ్డి, వివిధ పరిశ్రమల ప్రతినిధులు వెంకట్రావు, మాధవరావు, భాస్కర్ రెడ్డి, అర్జున్, సతీష్, శివ, బాల్రెడ్డి,, భూపాల్ రెడ్డి, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News