అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 3, 4, 6 తేదీలలో పటాన్ చెరు కేంద్రంగా నియోజకవర్గస్థాయి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా దినోత్సవ వేడుకలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పటాన్ చెరు జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, మహిళా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.