ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి చోటు దక్కింది. గురువారం సాయంత్రం రాజభవన్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు గనులు, భూగర్భ వనరుల శాఖ కేటాయించారు. కాగా మంత్రిగా మొదటిసారి మొయినాబాద్ చేరుకున్న సందర్బంగా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పట్నం అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రికి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పలుగ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పట్నం అభిమానులు పాల్గొన్నారు.
Patnam Mahindar received grand welcome: మంత్రి మహేందర్ రెడ్డికి మొయినాబాద్ లో ఘన స్వాగతం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


