ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం హట్టిగూడలో 432 మంది ఇళ్లు లేని నిరుపేదలకు 2వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేసిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, పెద్దంబర్ పేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్వప్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గతంలో ఎప్పుడు లేని విధంగా జిహెచ్ఎంసి పరిధిలోని నిరుపేదలకు ధనవంతుల ఇళ్ల తరహాలో రూ. 10వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ నిర్మించి ఇస్తున్నామని మంత్రి అన్నారు. తొలి విడతలో 11,700 అందివ్వగా 2వ విడతలో 13,200 ఇళ్లను 9 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 23, 300 ఇళ్ల ను పంపిణీ చేస్తున్నామన్నారు మంత్రి పట్నం.
జిహెచ్ఎంసి పరిసర రంగారెడ్డి జిల్లా పరిధిలో 23,260 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు. ఇబ్రహీంపట్నంలో 9872, మహేశ్వరం నియోజకవర్గంలో 9892, రాజేంద్రనగర్ లో 696, ఎల్బీనగర్ లో 944, చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లిలో 1512, శేర్లింగంపల్లిలో 344 ఇళ్లను నిర్మించి ఇస్తున్నామన్నారు.