తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) నేడు 71వ ఏటలోకి అడుగుపెట్టారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా కేసీఆర్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు.
“తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను” అని ట్వీట్ చేశారు.
మరోవైపు ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేష్, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తదితర ప్రముఖ నేతలు కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే.