తెలంగాణ కాలుష్య నియంత్రమండలి ఆధ్వర్యంలో ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ కాలేజ్ ఉమెన్స్ (A) నాంపల్లి దగ్గర వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ అనుకూల గణేష్ అంశం పైన అవగాహన కార్యక్రమాన్ని విభూతి బ్రదర్స్ కళాజాత ప్రదర్శన ద్వారా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఫెస్టివల్ అంశం పైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి నాగేశ్వరరావు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువు మట్టితో గణేష్ పండుగ సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. సహజ వనరులైన అడవులు గాలి నీరు చెరువులు హైదరాబాద్ లో ఉండాలని కోరారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పర్యావరణాన్ని కొలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ (బోటనీ) డాక్టర్ బి.ఎస్ రజిత, అసిస్టెంట్ ప్రొఫెసర్(బోటనీ) డాక్టర్ యు అనిత పాల్గొన్నారు.