తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సికింద్రాబాద్ లో ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ పై అవగాహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. నాగేశ్వరరావు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు ఎలక్ట్రానిక్ వేస్ట్ రీసైక్లింగ్ అంశంపై వివరించారు. ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ పైన మాట్లాడారు. వాడి పడేసిన ఎలక్ట్రానిక్ వస్తువులలో ఉండే లెడ్ ప్లాస్టిక్, క్రోమియం, మెర్కురి, క్యాడ్మియం,కాపర్ వాటి బారి నుండి జాగ్రత్త పడాలని అన్నారు.అందుకు రీసైక్లింగ్ అవసరం ఉందని చెప్పారు.
ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల బల్క్ కన్జ్యూమర్స్ దగ్గర్లో ఉన్న రీసైక్లర్స్ కానీ కలెక్షన్ సెంటర్లో గానీ అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, డాక్టర్ శశాంక్ కుందా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.