భారత రాష్ట్ర సమితి పార్టీ రైతుల పక్షపాతి అని నర్సంపేట నియోజకవర్గం బారాస పార్టీ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట మున్సిపల్ ద్వారక పేట రైతులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలచే ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కాలువలను ఆధునీకరించి పునరుద్ధరణ చేపట్టి పాకాల ఆయకట్టు చివరి హెక్టార్ వరకు నీళ్ళందించే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. ఆలోచన వస్తే దాన్ని ఆచరణలో చేసి చూపే తత్వం నాదని, రెండు పంటల సంస్కృతికి నాంది పలికింది గులాభి పార్టీ అని అన్నారు. నియోజక వర్గ ప్రజలను సగర్వంగా ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉందన్నారు. ఇన్నేళ్ళు ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న ప్రతి పక్షాలకు ఇంకా పదవులపై మోజు పోలేదని, మరోసారి మాయమాటలతో ఏమార్చే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.
మోసపోతే ఘోస పడుతం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. పని చేసే సత్తా ఉంది గనుకనే ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, నర్సంపేట కీర్తిని అసెంబ్లీ సాక్షిగా చాటి చెప్పిన ఘనత తనదేనన్నారు. ఉనికి కొరకు వారు, అభివృద్ది కొరకు మేమని, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరు సమర్థులో ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఏండ్ల నుండి వెనుకబాటుకు గురైనం.. మార్పు దిశగా ముందుకు పోతున్న తరుణంలో మీ అందరి ఆశీస్సులతో మరోమారు భరిలో ఉన్నాను.. కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్, వార్డుల అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.