Sunday, October 6, 2024
HomeతెలంగాణGodavari Floods: భద్రాచలానికి శాశ్వత రక్షణ.. త్వరలో భారీ కరకట్టల నిర్మాణం

Godavari Floods: భద్రాచలానికి శాశ్వత రక్షణ.. త్వరలో భారీ కరకట్టల నిర్మాణం

- Advertisement -

Godavari Floods: గోదావరి వరద ముంపు నుంచి భద్రాచలం రక్షణకు శ్రీరామ రక్షలా భావిస్తున్న కరకట్టల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గోదావరి వరద నుంచి భద్రాచలం ప్రాంతానికి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు రెండు భారీ కరకట్టలు నిర్మించనున్నారు. నదికి వరద వచ్చినప్పు డు వాగుల ప్రవాహం స్తంభించి స్థానికంగా ముంపు పెరుగుతుండటాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నా రు.

భద్రాచలం, బూర్గంపాడు రెండు వైపులా కలిపి 58 కిమీ నుండి 65 కిమీ పొడవున ఈ కరకట్టలు నిర్మించనున్నారు. ఇటీవల వచ్చిన వరదను పరిగణలోకి తీసుకొని ఈ కట్టల నిర్మాణం ప్లాన్ చేయగా స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. తాజాగా కరకట్టలపై సిద్ధమైన లైన్‌ ఎస్టిమేట్ల మేరకు త్వరలోనే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ కరకట్టల నిర్మాణానికి 58 కిలోమీటర్ల పొడవుతో అయితే రూ.1,585 కోట్లు, అదే 65 కిలోమీటర్లయితే రూ.1,625 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. నదికి కుడివైపు బూర్గం పాడు మండలం సంజీవ్రెడ్డి పాలెం నుంచి అశ్వాపురం
మండలం అమ్మ గారిపల్లి గ్రామం వరకు ఒకవైపు కట్ట నిర్మిస్తారు. నదికి ఎడమవైపు భద్రాచలం మండలం సుభాష్ నగర్ కాలనీ నుంచి దుమ్ము గూడెం మండలం సున్నం బట్టీ గ్రామం వరకు ఒక కట్ట నిర్మా ణం ఉంటుంది.

ఒక్కోవైపు 30 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల పొడవుతో కట్ట నిర్మాణం ఉంటుంది. కట్ట నిర్మాణం బారుగా కాకుండా గ్రామాలు వచ్చిన చోట కొంత గ్యాప్ వదలాలని, నదీ తీరం వెంబడి గ్రామాలకు సమీపంలో ‘యు’ అక్షరం ఆకారంలో కట్టలను నిర్మించాలన్న ది ప్రాథమిక అంచనాల్లో ఉన్న కీలక అంశాలు. వాగుల్లోని నీరు నదిలోకి వెళ్లేందుకు వీలుగా కట్టకు, వాగుకు మధ్య నిర్మా ణం చేపడతారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News