Sunday, October 6, 2024
HomeతెలంగాణPilot: నేను మోదీ లాగా షూటింగ్ లు చేస్తాలే

Pilot: నేను మోదీ లాగా షూటింగ్ లు చేస్తాలే

వైరల్ అవుతున్న వీడియో యూస్ లెస్ టాపిక్ అంటున్న ఎమ్మెల్యే

తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ రాజశ్యామల, శత చండీ, సౌర లక్ష్మీ సుదర్శన సహిత అతిరుద్ర మహాయాగంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వై క్యాటగిరి సెక్యూరిటీతో నడుచుకుంటూ వచ్చే ఒక వీడియో సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై స్థానిక ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్రమిచ్చిన వై కేటగిరి భద్రతను ఫోటోషూట్ కు వాడుతున్నారని, ఫోటోషూట్ కోసమే ప్రత్యేకంగా వాడినట్లుగా కనిపిస్తుందని విమర్శించారు.

- Advertisement -

వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే…

నేను మోదీ లాగా షూటింగ్ లు చేయలేను. నేను నడుచుకుంటూ వస్తే పక్క నుంచి వీడియోలు షూట్ చేశారు. ఇప్పడు కొత్తగా వచ్చిన కొన్ని సాఫ్ట్ వేర్ లో ఎడిట్ చేసి వీడియోలు అప్లోడ్ చేశారు. ప్రత్యేకంగా వీడియో షూట్ చేయలేదు, ఇది అసల్ యూస్ లెస్ టాపిక్ అని ఎమ్మెల్యే కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News