Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

Pilot: బిజెపి నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

100 మందికి పైగా బీఆర్ఎస్ లోకి చేరిక

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే బీఆర్ఎస్‌లోకి భారీగా వరుసపెట్టి చేరికలు జరుగుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండలం బహదూర్‌పూర్ యువనేత శ్రీకాంత్ అధ్వర్యంలో బీజేపీ నుంచి సుమారు వంద మంది యువకులు సాయి సంపత్, కావలి నరోత్తమ్, మెట్టు హనుమంతు, నవీన్, ప్రభాకర్, దేవర శ్రీనివాస్, ప్రదీప్, మహేష్, నవీన్, విక్రమ్ తదితరులు పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి గులాబీ కండువాలను స్వీకరించడం సంతోషం అని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి, సీనియర్ నాయకులు, సర్పంచులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News