Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో బిఆర్ఎస్ గెలుపు ఖాయం

Pilot: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరులో బిఆర్ఎస్ గెలుపు ఖాయం

తాండూరులో మనమే గెలవాలంటున్న ఎమ్మెల్యే

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే తాండూరు నియోజకవర్గం నుండి భారీ మెజారిటీని సాధించాలని బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డ మీద గులాబీ జెండాను ఎగురవేయాలి, గెలుపులో ఎలాంటి సందేహం లేదు. తాండూరు నియోజకవర్గ ప్రజలు బిఆర్ఎస్ గెలుపు కోరుతున్నారు. అలాంటి ఇలాంటి గెలుపు కాదు అత్యధిక భారీ మెజారిటీ సాధించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలన్నారు, చేస్తారని నమ్మకం ఉందని అన్నారు. తాండూరులో మెజారిటీ ఎలా అంటే, బ్యాలెట్ బాక్స్ లు బద్దలు బద్దలైయేలా భారీ మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. గెలుపుకు ప్రతిఒక్క నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంపొందించుకోవాలని, ఐకమత్యంతో ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News