Friday, November 22, 2024
HomeతెలంగాణPilot: మా అమ్మ టీచరే, టీచర్ల కష్టాలు నాకు తెలుసన్న ఎమ్మెల్యే

Pilot: మా అమ్మ టీచరే, టీచర్ల కష్టాలు నాకు తెలుసన్న ఎమ్మెల్యే

నర్సింగ్ కళాశాల కొసం 25 కోట్లు మంజూరు

విద్యారంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ పరిధిలోని జీపీఆర్ గార్డెన్స్ లో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (PRTUTS) వికారాబాద్ జిల్లా యునియన్ ఆద్వర్యంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… పిఆర్టియు అంటే ఉపాధ్యాయ సంఘాలను అతిపెద్ద సంఘంగా ఎన్నో దశాబ్దాల నుంచి ప్రఖ్యాతిగాంచిందన్నారు. నేను కూడా మీ కుటుంబ సభ్యుడినేనని.. మా అమ్మగారు మీలాగే ఒక బడిపంతురాలని తెలిపారు. ఒకప్పుడు గురుకులాల చదువు కోసం వికారాబాద్ వరకు వెళ్లాల్సి వచ్చేదని.. కానీ ఇప్పుడు తాండూరులోనే రెసిడెన్సియల్ స్కూల్స్ వచ్చాయన్నారు. నర్సింగ్ కళాశాల కొరకు రూ. 25 కోట్లు మంజూరు చేశామని, త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. పీఆర్టియుటిఎస్ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, తాండూరులో పీఆర్టియుటిఎస్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీచర్ల కష్టాలు నాకు తెలుసని.. నా చిన్ననాటి నుంచి నేను చూశానన్నారు. ఉపాధ్యాయులంటే నాకు ఎంతో గౌరవం అమ్మచేతుల మీదుగా పెరిగాను కాబట్టి ఈరోజు నాకు కూడా కొన్ని ఎథిక్స్ , మోరల్స్ ఉన్నాయన్నారు. అందుకనే తాండూరును అభివృద్ధి చేసి, ఆదర్శవంతమైన నియోజకవర్గంలా చేయాలని .. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అనుకున్నది సాధిస్తున్నామని తెలిపారు.

- Advertisement -


అమ్మ ఆశీర్వాదం, ఆమె గైడెన్స్ తోనే నేను ఈ స్థాయికి వచ్చినంటే ఈ ఘనత మా అమ్మకి.. మీలాంటి ఉపాధ్యాయులకే అని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు. తాండూర్ నియోజకవర్గంలో విద్యకు పెద్దపీట వేస్తున్నానని.. ఈ క్రమంలోనే ప్రతీ స్కూడెంట్‌కు ఉచిత బస్ పాసులను అందిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం తాండూరు నియోజకవర్గంలోని 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న దాదాపు 129 టీచర్లను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టియుటిఎస్ ప్రెసిడెంట్ కడియాల చంద్రశేఖర్, సెక్రటరీ అమర్నాథ్, గౌరవ అధ్యక్షులు వెంకట్‌రామిరెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు చెన్నకేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ రాష్ట్ర సెక్రటరీ పూల రవిందర్, వికారాబాద్ జిల్లాలోని మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News