Monday, July 8, 2024
HomeతెలంగాణPilot Reddy: తాండూరు ప్రజలే నా బలం, నా బలగం

Pilot Reddy: తాండూరు ప్రజలే నా బలం, నా బలగం

‘గల్లీగల్లీకి పైలెట్’ కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలోని 19 వార్డులలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజా సమస్యల్ని నేరుగా అడిగి తెలుసుకున్నారు. వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోలేని విధంగా భారీగా నిధులు తీసుకొచ్చానని అన్నారు. గత నలబై ఏళ్లుగా చేయని అభివృద్ధిని నాలుగేళ్లలోనే చేసి చూపించానని.. ఒకప్పటి తాండూరు.. ఇప్పుడు తాండూరు ఎలా ఉందో ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలని అన్నారు. ప్రతీ వార్డుకు కోటి రూపాయలతో దాదాపు 80 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. ఇంకా ఏమైనా అరకొర పనులు ఉంటే మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే సత్తా నాకుందన్నారు. రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి, తాండూరు రూపురేఖలు మర్చి చూపిస్తా అన్నారు. ప్రతిపక్షాలకు అదిరేది లేదు..బెదిరేది లేదు ..తగ్గేదేలేదు అన్నారు. గత పాలకులు ఎన్నో సంవత్సరాలుగా తాండూర్ ప్రజలను మోసం చేస్తూనే వచ్చారు. అభివృద్ధి లేకుండా తాండూరు బోసిపోయింది, ఎక్కడ చూసినా గుంతలు, దుమ్ము , కాలుష్యం నీటి సమస్యలతో తాండూరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే. కొన్ని వార్డులలో కోటి రూపాయలు సరిపోతాలేవు అని వార్డు కౌన్సిలర్లు అడిగిన వెంటనే వారికి మరిన్ని నిధులును వార్డు అబివృద్ది కి కేటాయిస్తానని అన్నారు. అదేవిధంగా ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే కి వార్డు ప్రజలు హిందువులకు, ముస్లింలకు స్మశానవాటిక కావాలని కోరారు. కోరిన వెంటనే సరే అంటూ వాళ్లకు హామీ ఇచ్చాడు. నేను పుట్టింది తాండూరు గడ్డమీద, నేను తాండూర్ ని అభివృద్ధి చేయకుంటే ఎలా, నన్ను నమ్మి ఓట్లు వేసిన ప్రజలను మోసం చేయను. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుచుకుంటూనే వస్తున్న. అది నా బాధ్యత అని అన్నారు. తాండూర్ నియోజకవర్గ ప్రజలు నా కుటుంబం నా కుటుంబాన్నికి నేను ఒక పెద్ద కొడుకు లాగా చూసుకుంటాను. తాండూరు అభివృద్ధి నా దేయం, ముందు ముందు తాండూర్ ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు, వార్డు కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, సంగీత ఠాకూర్, ప్రభాకర్ గౌడ్, బాలప్ప, బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు, యువనేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News