Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది

Pilot: సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది

నన్ను బంపర్ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది

మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తాండూరు పట్టణంలో రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా దీవెన సమావేశంలో సెంట్రింగ్ కార్మిక సంఘం సభ్యులు పాల్గొని వారి సమస్యల్ని పైలెట్ దృష్టికి తీసుకురాగా వెంటనే సానుకూలంగా స్పందించడంతో సెంట్రింగ్ కార్మికులంతా సంపూర్ణ మద్దతు తెలపారు. ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… తాండూరులో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత నాకే దక్కుతుందన్నారు. కేవలం రెండేళ్లలోనే 1680 కోట్లు తీసుకొచ్చి మీ బిడ్డ రోహిత్ రెడ్డి రికార్డు సృష్టించాడని తెలిపారు. మరోసారి ఆశీర్వదించండి ఇంతకు మించిన అభివృద్ధిని చేసి చూపిస్తా అని అన్నారు. ప్రజా దీవెనలతో ఈ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచి తాండూరులో గులాబీ జెండా ఎగరేస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News