Monday, July 8, 2024
HomeతెలంగాణPilot: ఇంటోడు ఇంటోడే..బయటోడు బయటోడే

Pilot: ఇంటోడు ఇంటోడే..బయటోడు బయటోడే

తాండూరు గడ్డ బీఆర్ఎస్ అడ్డా

40 ఏళ్లలో ఎవ్వరూ చేయని విధంగా కేవలం మీ బిడ్డ రోహిత్ రెడ్డి రెండేళ్లలోనే 16 వందల 80 కోట్ల రూపాయలు తీసుకొచ్చి చరిత్ర తన ఘనతేనన్నారు పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు పట్టణంలోని మెట్రో ఫంక్షన్ హల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ….. గతంలో నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని.. ఒకప్పుడు తాండూరు ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది, తాండూరు అభివృద్ధే నా లక్ష్యమని.. మరోసారి ఆశీర్వదించండి ఇంతకు మించిన అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ హామీలన్నీ దొంగ హామీలని.. బీఆర్ఎస్ మేనిఫెస్టో సంచలనం అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని.. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం… కాంగ్రెస్ విషయానికి వస్తే తాండూరులో సగం ఊర్ల పేర్లు తెలియనివారు ఏం అభివృద్ధి చేస్తారన్నారు. ఎప్పటికైనా ఇంటోడు ఇంటోడే..బయటోడు బయటోడే అన్నారు. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదంతో బంపర్ మెజారిటీతో గెలిచి తాండూరు సత్తా చాటుతాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, సీనియర్ లీడర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News