Wednesday, January 8, 2025
HomeతెలంగాణPM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapally Railway Terminal)ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy), కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్‌(Bandi Sanjay) పాల్గొన్నారు. హాజరయ్యారు. వాస్తవంగా ఈనెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ రైల్వే టెర్నినల్‌ను ప్రారంభించాల్సి ఉంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) కన్నుమూయడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. మెట్రో నెట్‌వర్క్‌ 1000 కిలోమీటర్లకు పైగా పరిధి విస్తరించిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయని పేర్కొన్నారు. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు.

అనంతరం చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి డ్రైపోర్టు ఇవ్వాలని, RRR నిర్మాణానికి సహకరించాలని.. మెట్రో రైలు విస్తరణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్‌ ఎకానమీ సాధిస్తుందన్నారు.

కాగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రైల్వే ప్రయాణికుల ఒత్తిడిని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే రూ.413 కోట్లతో అత్యాధునిక వసతులతో ఈ టెర్మినల్‌ను నిర్మించింది. స్టేషన్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరు బుకింగ్ కౌంటర్లు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ వెయిటింగ్ హాల్స్, హై క్లాస్ వెయిటింగ్ లాంజ్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్‌లో రెస్టారెంట్, రెస్ట్ లాంజ్ ఏర్పాటు చేశారు. విశాలమైన కాన్కోర్స్ ఏరియాలు, అద్భుతమైన లుక్, అదిరిపోయే లైటింగ్‌, ఆధునిక ఎలివేషన్‌తో నిర్మించారు.

అంతేకాకుండా రెండు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటాయి. మొత్తం తొమ్మిది ప్లాట్‌ ఫారమ్‌లు నిర్మించారు. మొత్తం ఏడు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్లు నిర్మించారు. ఇక ఈ రైల్వే టెర్మినల్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ ఫారమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ ఫారమ్‌లు కూడా పూర్తి రైళ్లను ఉంచడానికి విస్తరించారు. అదనంగా 10 లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో మొత్తం 19 రైల్వే లైన్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News