Saturday, November 15, 2025
HomeతెలంగాణBirthday wishes: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెస్

Birthday wishes: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు.. ప్రధాని మోదీ సహా ప్రముఖుల విషెస్

CM Revanth Reddy birthday: సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా.. ప్రముఖ రాజకీయ నేతలు బర్త్ డే విషెస్ తెలిపారు. రేవంత్‌కు ఆ దేవుడు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేవంత్‌ రెడ్డికి బర్త్ డే విషెస్ చెబుతూ ఒక నోట్ విడుదల చేశారు.

- Advertisement -

అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, స్పీకర్ ఓం బిర్లా సైతం రేవంత్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుతు సోషల్‌ మీడియా ద్వారా విషెస్‌ తెలిపారు. కేంద్రమంత్రి బండిసంజయ్ సీఎం రేవంత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆ అమ్మవారి దయ, దీవెనలు ఎల్లవేళలా ఆయనకు ఉండాలని, ఆయురారోగ్యాలతో తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని బండిసంజయ్ ఆకాంక్షించారు.

రేవంత్‌రెడ్డి ప్రజాసేవలో కొనసాగాలి: ప్రముఖ నటుడు చిరంజీవి సైతం రేవంత్‌రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎంకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో రేవంత్‌ రెడ్డి సుదీర్ఘకాలం కొనసాగాలని పేర్కొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సైతం రేవంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని వారు ఆకాంక్షించారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad