భూదాన్ పోచంపల్లి మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటించారు. మండలంలోని దంతూరు గ్రామంలో నూతనంగా 12 లక్షల వ్యాయామంతో నిర్మించిన యాదవ సంఘం కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం దంతూరు గ్రామానికి చెందిన సుమారు వంద మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నారని వారి ఆశీర్వాదంతోనే భువనగిరి నియోజకవర్గంలో ప్రతి పట్టణాలు, గ్రామాలను అభివృద్ధిపరుస్తున్నామని తెలిపారు.
పోచంపల్లిలో సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం:
పోచంపల్లి మున్సిపల్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ పక్కన నిర్వహిస్తున్నటువంటి సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఉన్న వారితో కలిసి సరదాగా కాసేపు క్రికెట్ ఆడారు. అనంతరం ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి మంచి వ్యాయామంగా పనిచేస్తాయని దానితో ఆరోగ్యంగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, జడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్ యాదవ్, దంతూరు గ్రామ సర్పంచ్ దొటి కుమార్ యాదవ్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు బత్తుల మాధవి శ్రీశైలం, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిలువేరు బాల నరసింహ, కౌన్సిలర్లు గుండు మధు, సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి, దేవరాయకుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీత వెంకటేష్, ప్రధాన కార్యదర్శి గునిగంటి మల్లేష్ గౌడ్, లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ అంకం యాదగిరి, బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సీత శ్రవణ్, బిఆర్ఎస్ యువజన పార్టీ పట్టణ అధ్యక్షుడు సర్కిల్ క్రికెట్ ఆర్గనైజర్ కొమ్ము శ్యామ్, మండల యువజన పార్టీ నాయకులు చింతకింది కిరణ్, నోముల ఉపేందర్ రెడ్డి, వేముల సుమన్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.