Thursday, July 4, 2024
HomeతెలంగాణPocharam: అభివృద్ధికి మారుపేరు తెలంగాణ

Pocharam: అభివృద్ధికి మారుపేరు తెలంగాణ

500 కోట్లతో బాన్సువాడను అభివృద్ధి చేశాం

పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి పథంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ అని, అభివృద్ధికి మారుపేరు తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. సీఎం కెసిఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై పక్క రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని అన్నారు.మహారాష్ట్ర ప్రజలు తెలంగాణలో ఒక గుంట భూమిని కొనుక్కొని ఉచిత విద్యుత్,రైతు బీమా,రైతు బంధు వంటి పథకాలను పొందుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందిస్తున్నారని అయినా హైస్కూల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడం సరికాదన్నారు.విద్యార్థుల సంఖ్యను పెంచండి, అవసరమైతే పాఠశాలకు కావలసిన అదనపు గదులను ఇస్తాన్నానారు. ఉన్నత విద్యాభివృద్ధికై బాన్సువాడ నియోజక వర్గ వ్యాప్తంగా అనేక ప్రభుత్వ, కస్తూర్బా, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు అలాగే వృత్తి విద్య కళాశాలలు ఉన్నా యని, వాటిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాన్సువాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులను చేశామన్నారు. గ్రామంలో అక్కడక్కడ రేకుల షెడ్డు చూశానని, వారికోసం మూడు లక్షల స్కీములో 60 ఇండ్లను ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాధవరావు పటేల్, ఎంపీటీసీ సాయిలు, జడ్పిటిసి శంకర్ పటేల్, ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్, జిల్లా, మండల కోఆప్షన్ సభ్యులు సిరాజుద్దీన్, ఇస్మాయిల్, ఏసీపీ కిరణ్ కుమార్, ఆర్డీవో రాజా గౌడ్, రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి , వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, మండల్ ప్రెసిడెంట్ ఏజాస్ ఖాన్, హౌసింగ్ డిఈ నాగేశ్వర రావు, ఎండిఓ మనోహర్ రెడ్డి, ఎమ్మార్వో సాయిలు, సుంకిని గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు, కిషోర్ బాబు, ఎజాస్ ఖాన్, నిరడి గంగాధర్, మండల ప్రజాప్రతి నిధులు, అధికారులు, సుంకిని గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News