Saturday, November 23, 2024
HomeతెలంగాణPocharam: ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన స్పీకర్

Pocharam: ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన స్పీకర్

భక్తి మార్గంలో ఉన్నప్పుడే భగవంతుడు చల్లగా చూస్తాడు

బాన్సువాడ నియోజకవర్గంలోని పలు మండలాలలోని అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పోతంగల్ మండల కేంద్రంలోని పాత పోతంగల్ లో పురోహితుల వేద మంత్రాలతో వీర హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ హనుమాన్ మందిరానికి ఎస్డిఎఫ్ నిధులు నుండి 30 లక్షలు మంజూరు చేశారు. అనంతరం 15 లక్షలతో నిర్మాణం చేసిన హనుమాన్ ఆలయ కమ్యూనిటీ హాలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కెసిఆర్ సహకారంతో బాన్స్వాడ నియోజకవర్గంలోని మసీదులు, మందిరాలు, చర్చిలను 150 కోట్లతో నిర్మాణం చేశామన్నారు. భగవంతుడు ఇలాగే ఆశీర్వదిస్తే బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకి సేవ చేయడానికి తాను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానన్నారు. ఈ భగవంతుని నిర్మాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు.ఈ భూమి పూజ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, ఉప సర్పంచ్ వినోద్ కుమార్, విలేజ్ ప్రెసిడెంట్ మానికప్ప, ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News