Sex Racket: హైదరాబాద్ పోలీసులు భారీ సెక్స్ రాకెట్‌ను గుట్టురట్టు చేశారు. సెక్స్ రాకెట్ ముఠాలో 17మందిని అరెస్టు చేశారు. 15 సిటీల నుంచి అమ్మాయిలను సరఫరా చేసి గుట్టుగా సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. కొంతమంది ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలతో పాటు విదేశీ మహిళలతో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు తెలిపారు. వెబ్‌సైట్, వాట్సప్ గ్రూప్స్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి అమ్మాయిలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఇందులో 1,419 మంది అమ్మాయిలు ఉన్నట్లు సీపీ తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిపై 39 కేసుల్లో ప్రమేయం ఉందని, నిందితులపై సైబరాబాద్‌లో ఐదు కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీపీ తెలిపారు.
సెక్స్ రాకెట్స్‌తోపాటు డ్రగ్స్ కూడా సప్లయ్ చేస్తూ కస్టమర్లుకు ఈ ముఠా ఎరవేస్తుంది. సప్లేయర్స్ , బ్రోకర్లు ద్వారా భాదితులను కస్టమర్లు దగ్గర కు పంపుతున్నారు. విమానాల్లో కూడా అమ్మాయిలను వేరే రాష్ట్రాలకు కస్టమర్లు దగ్గరకు పంపుతున్నారని సీపీ తెలిపారు. ఏపీ , తెలంగాణా, కర్ణాటక , ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తాకి చెందిన వారు భాదితులు ఉన్నారు. బంగ్లాదేశ్, నేపాల్, యూజీకిస్తాన్, రష్యా కి చెందిన అమ్మాయిలతో కూడా ఈ దందా చేస్తున్నారని, వ్యభిచారం ద్వారా వచ్చిన సొమ్ములో 30శాతం అమ్మాయిలకు, 35శాతం యాడ్స్ (వెబ్ సైట్ కి వెళుతుంది), 35శాతం ఆర్గనైజర్లకి వెళుతుందని గుర్తించినట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఆర్నావ్ అనే వ్యక్తి కీలక నిందితుడని సీపీ తెలిపారు. 915 మంది అమ్మాయిలని ముంబై, కోల్ కత్తా నుండి సప్లయ్ చేశాడన్నారు. అదేవిధంగా.. 2019 నుండి సమీర్ అనే వ్యక్తి 850 మంది అమ్మాయిలను సప్లయ్ చేస్తున్నాడని, అనంతపూర్, కరీంనగర్ నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో సెక్స్ రాకెట్ నడుపుతున్నారని సీపీ తెలిపారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో ఆర్నావ్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్, వ్యభిచార దందా చేస్తున్నాడని, ఆర్నావ్ 950 మంది అమ్మాయిలతో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్నాడని గుర్తించామన్నారు. సోమజిగూడా లో ఆర్నావ్ ను ఓ ఫ్లాట్ లో పెట్టుకున్నాం, అదే ఇంట్లోనే ఎండీఎంఏ డ్రగ్స్ ను సీజ్ చేశామన్నారు. ఈ సెక్స్ రాకెట్ వివిధ గ్రూప్ లుగా విడిపోయి ఈ దందా చేస్తున్నారు. కొన్ని హోటల్స్ కి పని చేసే వాళ్ళు కూడా ప్రమేయం ఉంది, వారిని కూడా అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు.
వెబ్ సైట్ లో బుక్ చేసుకున్న వారికి అమ్మాయిలని సప్లయ్ చేస్తున్నారు. వీరి టార్గెట్.. జాబ్ లేని, పేదరికంలో ఉన్న అమ్మాయిలేనని సీపీ తెలిపారు. జాబ్స్ పేరుతో ఆ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. ఎండీఎంఏ డ్రగ్స్ ను అమ్మాయిలకు , కస్టమర్లు కు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని, చాలా మంది అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు. మరి కొంతమందిని లగ్జరీ లైఫ్ చూపించి అమ్మాయిలను ఈ వ్యభిచారంలోకి దింపుతున్నట్లు సీపీ తెలిపారు.