Thursday, November 14, 2024
HomeతెలంగాణPhone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు

Phone Tapping | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు

తెలంగాణలో ప్రభుత్వం మారిన నాటి నుంచి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు అధికారులను మాత్రమే విచారించిన కేసు దర్యాప్తు బృందం.. తాజాగా ఓ రాజకీయ నేతకు నోటీసులు జారీ చేసింది. నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కు సోమవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో నిందితుడుగా ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్ లో ఉన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు నోటీసులు పంపిన అధికారులు.. నేడు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాలో శాశ్వత నివాసానికి వీలు కల్పించే గ్రీన్ కార్డు దక్కించుకున్నారు. దీంతో ఈ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News