Sunday, July 7, 2024
HomeతెలంగాణPolice Mera Dost: యువత ఉన్నత లక్ష్యలతో భవిష్యత్తు దిద్దుకోవాలి

Police Mera Dost: యువత ఉన్నత లక్ష్యలతో భవిష్యత్తు దిద్దుకోవాలి

పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం "పోలీస్ మేర దోస్త్"కార్యక్రమం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పునస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పోలీస్ మేర దోస్త్” కార్యక్రమం ఏర్పాటు చేసి వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ లాల్ నాయక్ తండా యువతకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐ పి ఎస్ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలు మరింత దగ్గర అవ్వడానికి పోలీస్ ఉన్నది మీకోసం మీ భద్రత కోసమే అనే నమ్మకం కలగడం కోసం “పోలీస్ మేర దోస్త్”కార్యక్రమం ఏర్పాటు చేసి మీతో మమేకమయ్యారని, ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ద్యేయం అన్నారు.

- Advertisement -

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం పరిస్థితులు సౌకర్యాలు ఎన్నో మెరుగు పడ్డాయని అన్నారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలని, యువత చెడు మార్గాల వైపు మరలకుండా వారితో మమేకమై కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా వివిధ కార్యక్రమాలు పోలీస్ శాఖ తరపున నిర్వహిస్తామన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని, స్పోర్ట్స్ కోటా తో కూడా ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడలతో శారీరక దారుఢ్యం పెరుగుతుందని, క్రీడల పోటీల నిర్వహణకు పోలీస్ శాఖ తరుపున యువతకు ఎల్లవేళలా సహకరించి, ప్రోత్సహిస్తామని అన్నారు.


యువకులు గంజాయి, జూదం వంటి చెడు వ్యసనాలకు,ఇతర చెడు మార్గాల వైపు మరలకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ఉద్యోగాలు సంపాదించి,తమ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని,గ్రామానికి,జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు.గ్రామంలో ఒక్కరికి ఉద్యోగం వస్తే గ్రామంలో పది మంది తన వెంట వస్తారని అన్నారు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మొబైల్ కి వచ్చిన లింక్స్ క్లిక్ చేయవద్దు అని ఎవరైనా కాల్ చేసి OTP చెప్పమంటే చెప్పవద్దు అని,సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు.
ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, ప్రమాదాలు చెప్పి రావాని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని వహనాలు నడిపోయేటప్పుడు తప్పకుండా హెల్మెట్ వాడాలన్నారు.


కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా తాండ ల యువకులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ మోగిలి,వెంకటేష్, ఎస్.ఐ నవత,పోలీస్ సిబ్బంది, తండా గ్రామాల సర్పంచులు,ప్రజలు,యువకులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News