కొడంగల్ బీఆర్ఎస్(BRS) మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి(Patnam Narendar Reddy)కి మరో షాక్ తగిలింది. జనవరి 2న ఉదయం 11.00 గంటలకు బొంరాస్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు.
- Advertisement -
ఇటీవల రోటిబండ తాండ ఘటనలో అరెస్ట్ అయిన నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్‌పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో నరేందర్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది.