ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్బంగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయమునకు రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి వచ్చారు. హైదరాబాదు సిటి పోలీసు తరపున శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయము వద్ద కట్టుదిట్టమైన బారీ బందోబస్తు ఏర్పాటు చేసింది, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి సిటీ బందోబస్తు ఏర్పాట్లను ప్రత్యక్షంగా ఉండి పర్యేవేక్షించారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి సతీమణితో అమ్మవారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్తకోట శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో సుమారు 1500 మంది పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
మహిళ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా షీ టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసామని తెలిపారు. ఈవ్ టీజింగ్, గొలుసు, జేబు దొంగతనాలు జరగకుండా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామన్నరు. విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్, పి విశ్వప్రసాద్ ఐపీఎస్ అడిషనల్ సీపీ ట్రాఫిక్, డిసిపిలు నార్త్ జోన్, షీ టీం, సైబర్ క్రైమ్, సిసిఎస్, టాస్క్ ఫోర్స్, ట్రాఫిక్, ఇతర అధికారులు బందోబస్తులో పాల్గొన్నారు.