Saturday, November 15, 2025
HomeతెలంగాణTG Police job: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన!

TG Police job: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన!

Telangana Police Vacancies: నిరుద్యోగులకు రేవంత్‌ సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. త్వరలోనే పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పోలీస్‌ విభాగంలో దాదాపు 12 వేల పైగా ఖాళీలు ఉన్నాయని గుర్తించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండ్ ఆదేశాలు అందిన వెంటనే.. ప్రతిపాదనలు పంపేందుకు బోర్డు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గత కొంతకాలంగా పోలీసుశాఖలో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నా.. పదవీ విరమణ ద్వారా ఏర్పడుతున్న ఖాళీలనే భర్తీ చేస్తున్నారు.

- Advertisement -

డైరెక్ట్ రిక్రూట్‌మెంట్: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో.. రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమర్పించింది. ప్రత్యక్ష నియామకాల (డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) పద్ధతిలో వివిధ కేటగిరీలలో మొత్తం 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పోలీసు శాఖ నివేదించింది.

Also Read:https://teluguprabha.net/telangana-news/mla-komatireddy-rajagopal-reddy-condemns-comments-against-him-in-social-media/

ఖాళీ వివరాలు: పోలీసు శాఖ అందించిన వివరాల ప్రకారం, అత్యధిక ఖాళీలు ఉన్న కేటగిరీలు ఈ విధంగా ఉన్నాయి:

  • పోలీస్ కానిస్టేబుల్ (సివిల్): 8,442 పోస్టులు
  • పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్): 3,271 పోస్టులు
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్): 677 పోస్టులు
  • సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్): 40 పోస్టులు
  • టీజీఎస్పీ: 22 పోస్టులు

ఉద్యోగ ఖాళీల సేకరణకు ప్రత్యేక కమిటీ: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలపై సమగ్ర సమీక్ష కోసం ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై ఉన్నవారి వివరాలను సేకరిస్తోంది. పని భారానికి తగినట్లుగా పోస్టులు ఉన్నాయా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు తమ ఖాళీల వివరాలను కమిటీకి స్పష్టంగా అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సర్క్యులర్ జారీ చేశారు. ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆ తర్వాతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పోలీసు శాఖకు సంబంధించిన వివరాలు మాత్రమే ప్రభుత్వానికి అందగా మిగిలిన శాఖల సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad