Saturday, November 15, 2025
HomeTop StoriesTelangana: సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కిన రాజకీయాలు.. అంబేదర్క్‌ విగ్రహం వద్ద పంచాయితీ!

Telangana: సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కిన రాజకీయాలు.. అంబేదర్క్‌ విగ్రహం వద్ద పంచాయితీ!

political war in telangana: గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ పక్క జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం.. మరో పక్కా ముఖ్యనేతల మధ్య అభివృద్ధి విషయమై విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత రాజకీయాలపై అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలు సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, మాజీ మంత్రుల మధ్య రాజకీయ సవాళ్లు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాలనపై చర్చకు సచివాలయం వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం వద్దకు రావాలని మంత్రి కొప్పుల.. అడ్లూరికి సవాల్‌ విసిరారు. దీంతో వెంటనే అడ్లూరి ప్రతిసవాల్ విసిరారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు చర్చకు రావాలని అన్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

- Advertisement -

మీ పాలన.. మా పాలనపై దమ్ముంటే రండీ: పదేళ్ల బీఆర్ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరుకి .. కొప్పుల ఈశ్వర్ సవాల్‌ విసిరారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తున్నట్టు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కొప్పుల వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి తక్షణమే స్పందించారు. హరీశ్ రావు గడ్డ మీదకి వెళ్లి సవాల్‌ విసిరాను. దమ్ముంటే హరీశ్ రావు చర్చకు రావాలని ప్రతిసవాల్ విసిరారు. నా మీద ఓడిన కొప్పుల ఈశ్వర్ రావడం ఏంటని.. అడ్లూరి ఎద్దేవ చేశారు. నేను అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చేందుకు రెడీగా ఉన్నాను.. హరీశ్ రావు, కేటీఆర్ వస్తే బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాని మంత్రి అడ్లూరి అన్నరు. కొప్పుల ఈశ్వర్, రసమయి వస్తే మా ప్రీతం వెళ్లి సమాధానం చెప్తాడని అన్నారు. మీ పాలన.. మా పాలనపై దమ్ముంటే హరీశ్ రావు చర్చకు రావాలని డిమాండ్ చేశారు.

Also read:https://teluguprabha.net/telangana-news/harish-rao-says-brs-fight-against-auto-drivers-problems/

మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్‌: మంత్రి అడ్లూరి సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు స్వయంగా ఆటోలో ప్రయాణిస్తూ.. మంత్రి అడ్లూరికి సవాల్‌ విసిరారు. మా నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఒంటి గంటకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తారని అన్నారు. కొప్పుల ఈశ్వర్‌తో చర్చకు కాంగ్రెస్ నేతలు రెడీగా ఉండాలని కోరారు. కేబినెట్‌లో మంత్రుల పంచాయితీలు జరిగాయని అన్ని మీడియాలో సైతం వచ్చిందని తెలిపాుర. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకరిపై ఒకరు దూషించుకున్నారన్న నా వ్యాఖ్యలకు..ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకోవటానికే ఆటోలో ప్రయాణం చేస్తున్నానని అన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad