Saturday, November 15, 2025
HomeతెలంగాణPonguleti: హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Ponguleti: హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలు: మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Local Elections : రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్న వేళ, మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. “బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉంది. వచ్చే నెల 3న ఈ కేసుపై హైకోర్టులో విచారణ ఉంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటాం. నవంబర్ 7న మళ్లీ కేబినెట్ భేటీ ఉంటుంది” అని మంత్రి తెలిపారు.

- Advertisement -

నిర్ణయాలు: విద్యుత్, వైద్యం, ఫ్లోరైడ్ రహిత నల్గొండ!

కేవలం ఎన్నికలే కాక, మరిన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, ఆరోగ్య రంగానికి ఊతమిస్తూ నిర్మాణంలో ఉన్న నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు.

విద్యుత్ రంగంలో విప్లవాత్మక అడుగు వేస్తూ… 1500 మెగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు, కాలం చెల్లిన రామగుండం థర్మల్ ప్లాంట్‌ను డిస్‌మ్యాంటిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న నల్గొండ వాసులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శిస్తూ, శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని అందించాలని నిర్ణయించారు. దీనికోసం 44 కి.మీ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) కాకుండా, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి 2026 చివరి నాటికి ఈ టన్నెల్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad