Monday, December 9, 2024
HomeతెలంగాణPonguleti says Indiramma Houses prestigious issue: 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ...

Ponguleti says Indiramma Houses prestigious issue: 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌

ప్రతిష్ఠాత్మకం..

రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిర‌మ్మ ఇండ్ల ల‌బ్దిదారుల ఎంపిక‌ జరుగుతుందని, 15 రోజుల్లో గ్రామ క‌మిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంట‌నే జాబితాల ఖ‌రారు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టంచేశారు. ఇది నిరంత‌ర ప్ర‌క్రియ‌ అని, గ్రామాల‌లో ఇందిర‌మ్మ క‌మిటీల ఎంపికే ఫైన‌ల్‌ అని పొంగులేటి తేల్చి చెప్పారు. ఇండ్లు మ‌హిళ‌ల పేరిటే మంజూరు అవుతాయని, ల‌బ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నట్టు ఆయన వివరించారు. ఇందులో ఎటువంటి రాజ‌కీయ జోక్యం ఉండ‌దని, నిరుపేద‌లకు తొలి ప్రాధాన్యత‌ ఇస్తూ పేద‌రిక‌మే ప్రామాణికంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.

- Advertisement -

యాప్ దే కీలక పాత్ర..
ల‌బ్దిదారుల ఎంపిక‌లో ప్ర‌త్యేక యాప్ దే కీల‌క‌పాత్ర‌, అందుకే ఇంత స‌మ‌యం ప‌ట్టిందని, ఆధార్‌తో స‌హా అన్నివివరాలు యాప్ లో పొందుప‌రుస్తారని, 4 రాష్ట్రాలలోని ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వివ‌రాలు సేక‌రించి ముందుకు వెళ్తున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వని, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చని తెలిపారు. క‌నీసం 400 చ‌ద‌ర‌పు అడుగులు త‌గ్గ‌కుండా ల‌బ్దిదారుడు ఇల్లు నిర్మించుకోవాలని, నాలుగు ద‌శల్లో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందన్నారు.

నిర్మాణ ద‌శ‌ల వారీగా ల‌బ్దిదారుల‌కు చెల్లింపులు జరుగుతాయని, పునాదికి ల‌క్ష‌, గోడ‌ల‌కు లక్షా 25 వేలు, శ్లాబ్‌కు ల‌క్ష‌న్న‌ర‌, పూర్త‌యితే ల‌క్ష రూపాయిల చొప్పున చెల్లింపులన్నీ బ్యాంకు అకౌంట్ ద్వారానే సర్కారు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చే నిధుల‌ను తీసుకొని మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం భ‌రిస్తుందని, నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 లక్ష‌ల ఇండ్లు నిర్మిస్తామని, ప్ర‌తి నియోజ‌క‌వర్గంలో క‌నీసం 3500 ఇండ్లు నిర్మించేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కిచెన్, బాత్రూం తప్పనిసరిగా కట్టాల్సిందే..
ఇండ్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా వంట‌గ‌ది, బాత్రూం నిర్మించుకోవాలని, ప్ర‌తి మండ‌లంలో కనీసం ఒక‌రు లేదా ఇద్ద‌రు ఎఈ లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోనున్నట్టు వివరించారు. 16 శాఖ‌ల‌కు చెందిన వారిని స‌మీక‌రించి ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణ బాధ్య‌తలు అప్ప‌గిస్తామని, ఒకే గొడుగు నీడ‌న ఇంజినీర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇండ్ల నిర్మాణం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌పున 5 ల‌క్ష‌ల సాయం ఇస్తాం, ల‌బ్దిదారులు ఆర్ధిక ప‌రిస్దితి బ‌ట్టి ఇంకా క‌ట్టుకోవ‌చ్చని, దేశంలో తెలంగాణ మాత్ర‌మే ఇంత‌టి భారీ గృహ నిర్మాణం చేప‌ట్టి, 5 ల‌క్ష‌ల సాయం అందిస్తోందన్నారు. గ‌త ప్ర‌భుత్వంలో నిలిచిపోయిన సుమారు 600 -800 ఇండ్ల నిర్మాణానికి కూడా స‌హ‌క‌రిస్తామని, తొలి విడతగా సుమారు 28 వేల కోట్ల రూపాయిల వ‌ర‌కు కోట్లు ఖ‌ర్చు కావ‌చ్చని, సుమారు 7,740 కోట్ల రూపాయిల‌ను ఇందిర‌మ్మ ఇండ్లకు బ‌డ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపారు.

స్మార్ట్ కార్డుల ఆధారంగా ల‌బ్దిదారుల ఎంపిక‌ జరుగుతుందని, అర్హులైన విక‌లాంగులకు ప్రాధాన్య‌త ఇస్తే మంచిదేనని, గ్రామ క‌మిటీలదే తుది ఎంపికని ఆయన తెలిపారు.

మ‌రో నాలుగేళ్లు రేవంత్ రెడ్డే ముఖ్య‌మంత్రి
రాష్ట్రంలో సిఎం మార్పు అనేది ఉండ‌దు, మ‌రో నాలుగు సంవ‌త్స‌రాల ఒక నెల రేవంత్‌రెడ్డే ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతారని మంత్రి పొంగులేటి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రెండ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి ఎవ‌ర‌నేది అధిష్టానం నిర్ణ‌యిస్తుంది. ప్ర‌తిప‌క్షం కాబ‌ట్టి ఏదో ఒక‌టి మాట్లాడాల‌ని మాట్లాడుతోందని మంత్రి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News