Friday, November 22, 2024
HomeతెలంగాణPonguleti: తేల్చేసిన పొంగులేటి, పార్టీ-ముహూర్తం ఫిక్స్

Ponguleti: తేల్చేసిన పొంగులేటి, పార్టీ-ముహూర్తం ఫిక్స్

కేసీఆర్ని గద్దెదించడం ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుందో ఆ పార్టీలోనే చేరతా

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికకు దాదాపు రంగం సిద్ధమైంది. ఆ మేరకు శుక్రవారం ఖమ్మం నగరంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో తన అనుచరులు అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈరోజు సుమారు 1000 మందికి పైగా పాల్గొన్న సమావేశంలో తొలిత జై సీఎం జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో సమావేశం ప్రాంగణం హోరెత్తింది. సమావేశంలో ముఖ్య నేతల అభిప్రాయం మేరకు నియోజకవర్గాల వారీగా సేకరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏడు నుండి పదిమంది చొప్పున మాట్లాడే అవకాశం కలిగించి అభిప్రాయాన్ని స్వీకరించగా, ఎక్కువ మంది కాంగ్రెస్ లో చేరాలంటూ సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్ ద్వారానే సీఎం కేసీఆర్ని గద్దించచ్చని, కాంగ్రెస్ లో చేరాలంటూ స్పష్టం చేశారు. అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటానని హర్షద్వానాలు చప్పట్ల మధ్య చెప్పారు. హైదరాబాదులో తాను పార్టీలో చేరిక అంశాన్ని అధికారికంగా తెలియజేస్తానని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ని గద్దెదించడం ఏ పార్టీ ద్వారా సాధ్యమవుతుందో ఆ పార్టీలోనే చేరినట్లు పేర్కొన్నారు.
ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనను ఘోరంగా అవమానించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల నుండి నాయకులు కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News