Saturday, November 15, 2025
HomeతెలంగాణEV Policy Telangana : తెలంగాణలో చెక్ పోస్టులు పూర్తిగా రద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్...

EV Policy Telangana : తెలంగాణలో చెక్ పోస్టులు పూర్తిగా రద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

EV Policy Telangana : ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటనలు చేశారు. తెలంగాణలో చెక్ పోస్టులు పూర్తిగా రద్దు చేస్తూ GO జారీ చేశామని తెలిపారు. “ప్రజల్లో అవగాహన కల్పించడానికి, పారదర్శకత కోసం ఆన్లైన్ వ్యవస్థలు తీసుకువచ్చాం. రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుంచి అమలు చేస్తున్నాం” అని చెప్పారు. చెక్ పోస్టుల రద్దుతో అక్రమ రవాణా ఆగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్ పెంచుతామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కేబినెట్‌లో ఆమోదం పొందామని తెలిపారు.

- Advertisement -

ALSO READ: Rashmika Mandanna: బాక్సాఫీస్ వ‌ద్ద ర‌ష్మిక మంద‌న్న ర్యాంపేజ్ – తొలిరోజు థామాకు రికార్డ్ క‌లెక్ష‌న్స్‌

EV పాలసీపై మాట్లాడుతూ, ఢిల్లీలా పొల్యూషన్ రాకుండా చూడటానికి ఈ పాలసీ తీసుకువచ్చామని అన్నారు. EV వాహనాల అమ్మకాల్లో షేర్ 0.03 నుంచి 1.13కు పెరిగిందని, 577 కోట్ల టాక్స్ మినహాయింపు చేశామని వివరించారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటోలకు, LPG, CNG ఆటోలకు 10 వేల చొప్పున అనుమతులు ఇచ్చామని చెప్పారు. 25 వేల రెట్రోఫిటింగ్ ఆటోలకు కూడా అవకాశం కల్పించామని తెలిపారు.
రోడ్ సేఫ్టీపై దృష్టి పెట్టిన మంత్రి, డ్రైవింగ్ నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. చిల్డ్రన్ అవేర్‌నెస్ పార్కులు నాచారం (గవర్నర్ ప్రారంభం), కరీంనగర్‌లో ఏర్పాటు చేశామని చెప్పారు. కాలేజీల్లో రోడ్ సేఫ్టీ క్లబ్‌లు, ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకువస్తున్నామని తెలిపారు. టూరిజం వాహనాల్లో డబుల్ నంబర్ ప్లేట్ ఆరోపణలపై హై సెక్యూరిటీ ప్లేట్లు తీసుకువచ్చామని వివరించారు.

వాహన్ చట్టం అమలు, సారథి త్వరలో తీసుకువస్తామని ప్రకటించారు. స్క్రాపింగ్ పాలసీ, రేడియం స్టికర్లు (కేంద్ర నిబంధనల ప్రకారం) తీసుకువచ్చామని చెప్పారు. AI టెక్నాలజీతో రవాణా కార్యాలయాల్లో రికార్డులు, తరచూ వచ్చే వాళ్లను ట్రాక్ చేసి హెడ్ ఆఫీస్‌కు అలర్ట్ చేస్తున్నామని తెలిపారు. వెహికల్ ట్రాకింగ్ కొనసాగుతోందని అన్నారు.
రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ డిపార్ట్‌మెంట్‌గా, 112 AMVIలను నియమించి శిక్షణ ఇచ్చామని చెప్పారు. నలుగురు RTOలు గ్రూప్-1 ద్వారా వచ్చారు. శాఖకు కొత్త లోగో (పోలీస్, ఫారెస్ట్ మాదిరి), TSను TGగా మార్చామని తెలిపారు. ఇల్లీగల్, ఓవర్‌లోడింగ్‌పై కఠిన చర్యలు, బ్రోకర్ వ్యవస్థ అరికట్టడానికి కెమెరాలతో 63 కేంద్రాల పర్యవేక్షణ అని వివరించారు. పాత వాహనాలు స్క్రాప్‌కు పంపాలని పోలీస్, RTC, మైనింగ్‌కు లేఖ రాశామని చెప్పారు.

కేంద్ర క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ కార్యక్రమం అమలుపై మెడికల్, పోలీస్, నేషనల్ హైవేస్‌తో సమీక్ష చేశామని తెలిపారు. గత 10 సంవత్సరాల అవినీతిని విమర్శించి, వాహన్ సారథిలో 28 రాష్ట్రాలు ఉన్నా తెలంగాణ ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. ఇప్పుడు చేరామని, డేటా ట్రాన్స్‌ఫర్, అమలు జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని, ప్రమాదాలు తగ్గించే చర్యలు తీసుకుంటున్నామని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad