Saturday, February 8, 2025
HomeతెలంగాణPonnam Prabhakar: కేసుల మాఫీ కోసమేగా? కేటీఆర్ ట్వీట్‌కు పొన్నం కౌంటర్

Ponnam Prabhakar: కేసుల మాఫీ కోసమేగా? కేటీఆర్ ట్వీట్‌కు పొన్నం కౌంటర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైరికల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ గెలిపించినందుకు రాహుల్‌ గాంధీకి కంగ్రాట్స్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు. తాజాగా కేటీఆర్ ట్వీట్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

“ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి కన్నా బీజేపీ గెలుపు కేటీఆర్‌కి చాలా ఆనందం కలిగిస్తున్నట్టు ఉంది. లోలోపల చాలా సంతోషంగా ఉంటూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్న కేటీఆర్ ఇదంతా కేసుల మాఫీ కోసమే అనే మాట నిజం కాదా? అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అండదండతో ఇష్టానుసారం దోచుకుతిని అధికారం పోయాక కేసుల నుంచి విముక్తి పొందాలని బీజేపీ భజన చేస్తున్నారు. దేశాన్ని ఏలుతాము అని పార్టీ పేరు మార్చుకున్న మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏడ పోయింది ? ఆనాడు మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇదే విధంగా శునకానందం పొందినారు మీ భారత రాష్ట్ర సమితి నాయకులు. బీజేపీ-బీఆర్ఎస్ పార్టీల బంధం విడదీయలేనిదని సమస్త తెలంగాణ ప్రజలకు తెలిసిందని నేడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది” అని విమర్శించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News