దేశంలోని అన్ని రాష్ట్రాల రవాణాశాఖ మంత్రుల సమావేశంలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పాల్గొన్నారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఉపరితల రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయిన పొన్నం.. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలను వివరించారు. ఈ సమావేశానికి పొన్నంతో పాటు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.