Saturday, November 15, 2025
HomeTop StoriesPonnam Prabhakar: 'సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. అడ్లూరి నాకు అన్నలాంటివారు'

Ponnam Prabhakar: ‘సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ.. అడ్లూరి నాకు అన్నలాంటివారు’

Ponnam react on adluri episode: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య వివాదం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

అన్నా క్షమించండి!: సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగ నాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదని అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లక్ష్యం కూడా అదేనని అన్నారు. నేను అడ్లూరిని కించపరచకపోయినా మీడియాలో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడితే.. దానికి నేను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. మేమంతా ఐక్యంగా ఉంటూ భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పని చేస్తామని అన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కట్టుబడు ఉందని తెలిపారు.

మా బంధం రాజకీయాలకు మించినది: మంత్రుల మాటల యుద్ధంపై పొన్నం ప్రభాకర్‌ తాజాగా స్పందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నాకు సోదరుడు వంటివారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మాకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని పేర్కొన్నారు. ఆ బంధం రాజకీయాలకు మించినదని తెలిపారు. మా ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగిందని వెల్లడించారు. మమ్మల్ని ఎవరు విడదీయలేరని తెలిపారు. నేను ఆయనపై ఎటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని వ్యాఖ్యానించారు. బీసీ వర్గానికి చెందిన నాయకుడిగా.. నాకు ఎవరిపైనా అలాంటి అభిప్రాయం ఉండదని పొన్నం తెలిపారు.

కలిసికట్టుగా కృషి చేస్తాం: రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నా వ్యాఖ్యలను వక్రీకరించి మంత్రి పొన్నం అన్నారు. వాస్తవానికి భిన్నంగా ప్రచారని వాపోయారు. దాంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్న లాంటి అడ్లూరి లక్ష్మణ్ మనసు నొచ్చుకుందని తెలిసి నేను తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. ఆయన మనసు నొచ్చుకొని ఉంటే చింతిస్తున్నాని పొన్నం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను బలోపేతం చేయడంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం సాధనలో, ప్రజల అభ్యున్నతికై మేము ఇద్దరం కలిసికట్టుగా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/minister-adluri-laxman-hot-comments-on-ponnam-prabhakar/

అసలేం జరిగిందంటే: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో మంగళవారం రోజు ఇన్‌ఛార్జి మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి అందరూ వచ్చారు.. కానీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన సహచర మంత్రి ఒకరు సమయానికి రాలేకపోయారు. దీంతో పొన్నం తీవ్ర అసహనానికి లోనయ్యారు. పక్కనే ఉన్న మంత్రి వివేక్‌ చెవిలో పలు వ్యాఖ్యలు చేప్పినట్లు మీడియా సమావేశంలోని మైక్‌లో రికార్డు అయ్యింది. అందులో మీడియా సమావేశానికి రాని సహచర మంత్రిని ఉద్దేశించి.. బాడీ షేమింగ్‌ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం కవరింగ్‌ కోసం వచ్చిన యూట్యూబర్లు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టగా.. నిమిషాల్లోనే అది వైరల్‌ అయింది. దీంతో అడ్లూరి లక్ష్మణ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి స్థాయిలో ఉన్న పొన్నం ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు. పొన్నం ప్రభాకర్ మాదిరిగా నాకు అహంకారంగా మాట్లాడటం రాదని తెలిపారు. పొన్నం ఆయన తప్పు ఇప్పటికైనా తెలుసుకుంటాడని అనుకున్నా అని అడ్లూరి లక్ష్మణ్‌ తెలిపారు. జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని అన్నారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకోకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలంటూ అడ్లూరి లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. పొన్నం 24 గంటల్లో క్షమాపణ చెప్పాల్సిందేనని తెలిపారు. దీంతో ఈ ఆంశం అధికార పార్టీలో పెను సంచలనంగా మారింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad