Sunday, October 6, 2024
HomeతెలంగాణPrakash Goud: దివ్యాంగులకు అదనపు పెన్షన్

Prakash Goud: దివ్యాంగులకు అదనపు పెన్షన్

సంపద పెంచుతా పేదలకు పంచుతా అన్న నినాదంతో రాష్ట్ర పాలన

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మున్సిపాలిటీలో వై ఎన్ ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు అదనంగా పెన్షన్ పెంపుదల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ కోలన్ సుష్మా మహేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ భోగేశ్వరులు. దివ్యంగులకు అదనంగా పెన్షన్ పెంపుదల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదగా 23 వ వార్డ్ మధురనగర్ కు చెందిన హనుమంత్ రెడ్డి, బూడిది రాఘవేంద్రకు పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరిగిన పెన్షన్ లతో దివ్యాంగుల కుటుంబాల్లో నూతన వెలుగు, రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా 4016 పెన్షన్ లతో అందిస్తున్న ప్రభుత్వం అని అన్నారు.

- Advertisement -

దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, ఒకవైపు జీవనోపాధికి భరోసా కల్పిస్తూ మరోవైపు ఆసరా పెన్షన్ రూపంలో వారి జీవితానికి ఆర్దిక భరోసా అందిస్తున్న సీఎం కేసీఆర్ కి రాష్ట్ర దివ్యాంగుల సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నమని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా గడిచిన తొమ్మిది ఏళ్లలో పది వేల కోట్లు ఖర్చుపెట్టిన ఘనత సీఎం చూడుకేసీఆర్ ది అన్నారు. పెరిగిన ఆసరా పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా లబ్ధిదారులైన దివ్యాంగులకు మరింత ఆర్థిక భరోసా అందిస్తుందని తెలిపారు. సంపద పెంచుతా పేదలకు పంచుతా అన్న నినాదంతో రాష్ట్ర పాలన మొదలుపెట్టిన కేసీఆర్ ఆ క్రమంలో సబ్బండ వర్గాల సంక్షేమమే పథకాల రూపంలో అన్ని వర్గాలకు ఆర్థిక లబ్ధిని అందజేస్తూ ముందుకు సాగుతున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నర్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నీల మోహన్ , మండల్ అధ్యక్షులు చంద్రారెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు, కోలన్.మహేందర్ రెడ్డి, కొనమొల్ల.శ్రీనివాస్. మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు సెలవేంద్రీ శ్రీకాంత్ రెడ్డి,బిఆర్ఎస్ అధ్యక్షులు గోటూరి పవన్ గౌడ్, జైహింద్ రెడ్డి, బూడిది రమేష్ మండల మునిసిపల్ ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News