Saturday, November 23, 2024
HomeతెలంగాణPrakash Goud: కుల వృత్తుల వారికి వెన్నెముక కేసీఆర్

Prakash Goud: కుల వృత్తుల వారికి వెన్నెముక కేసీఆర్

ఇది నిరంతర ప్రక్రియ

కాటేదాన్ లోని అమ్మ గార్డెన్ లో నియోజకవర్గం పరిధిలోని బీసీ కుల, చేతి వృత్తుల వారికి 300 మంది లబ్ధిదారులకు గాను 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ హయాంలో చేనేత కార్మికులకు, కల్లు గీత కార్మికులకు పింఛన్లు ఇచ్చామని, గొల్ల కుర్మలకు ఉచితంగా గొర్రెల పంపిణీ చేశామని అన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పిల్లల పంపిణీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన స్వర్ణ యుగం అన్నారు. సమైక్య పాలనలో విధ్వంసం నేడు వికాసం అని గుర్తు చేశారు.

- Advertisement -

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఏదోరకంగా ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న మనమంతా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కెసిఆర్ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ కార్పొరేటర్ అర్చన జయప్రకాష్, శంషాబాద్ మున్సిపల్ చైర్మన్ సుష్మా వైస్ చైర్మన్ గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్ నార్సింగ్ వైస్ చైర్మన్ వెంకటేష్ శంషాబాద్ ఎంపీపీ జయమ్మ, జెడ్పిటిసి తన్విరాజు , మండల పార్టీ అధ్యక్షుడు చంద్ర రెడ్డి బీసీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ విమల, నీరజ రెడ్డి, జిహెచ్ఎంసి రాజేంద్రనగర్ సర్కిల్ డీసీ రవి, ఈ పి ఓ రాధా, శంషాబాద్ మండల సర్పంచులు ఎంపీటీసీలు, శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు నార్సింగ్ మున్సిపల్ కౌన్సిలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News