Saturday, October 5, 2024
HomeతెలంగాణMLA Prakash Goud: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

MLA Prakash Goud: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు

రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఆషాడ బోనాల సందర్భంగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండ్లగూడ గ్రామంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ మహేంద్ర గౌడ్, కార్పొరేటర్లు.ఎమ్మెల్యే. ప్రకాష్ గౌడ్ అతిధులుగా పాల్గొని అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయల కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బోనాల ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఆషాడ, శ్రావణ మాసాల్లో బోనాల పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో నిర్వహిస్తారని తెలిపారు. అమ్మవారి దయవల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ఒక ప్రతీక. అమ్మవారి దీవెనల కోసం బోనమెత్తే ప్రతి ఆడబిడ్డ హిందూ సంస్కృతికి నిజమైన వారసురాలు. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలి. రాష్ట్రంలో స కాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రతి ఇల్లు శోభిల్లాలని, తెలంగాణా రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదిగేలా దీవించాలని ప్రార్ధించారు. ప్రతి ఒక్కరు కలిసి మెలసి సంతోషంగా జరుపుకంటేనే అది నిజమైన పండగ అని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News