Tuesday, March 11, 2025
HomeతెలంగాణAmrutha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రణయ్ భార్య అమృత

Amrutha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రణయ్ భార్య అమృత

2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు(Pranay Murder Case) నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ2గా ఉన్న నిందితుడు సుభాష్‌కుమార్‌ శర్మకు ఉరిశిక్ష విధించింది. అలాగే ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలకు జీవితఖైదు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వీరిలో ఇప్పటికే సుభాష్‌శర్మ జైలులోనే ఉండగా అస్గర్‌ అలీ వేరే కేసులో జైలులో ఉన్నారు. మిగిలిన నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు.

- Advertisement -

తాజాగా కోర్టు తీర్పుపై ప్రణయ్ భార్య అమృత(Amrutha) స్పందించింది. కోర్టు తీర్పును స్వాగతిస్తూ ఆమె తన ఇన్‌ష్టాగ్రామ్ స్టోరీలో ” రెస్ట్‌ ఇన్‌ పీస్‌ ప్రణయ్” అంటూ పోస్ట్‌ పెట్టింది. ఆరేళ్ల తర్వాత కోర్టు తీర్పుతో ప్రణయ్‌ ఆత్మకు శాంతి కలిగిందంటూ అనే అర్థం వచ్చేలా ఈ పోస్టులో రాసుకొచ్చింది.

కాగా మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్ ఇద్దరు కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ హత్యకు సుపారీ ఇచ్చాడు. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రి వద్ద నిందితులు ప్రణయ్‌ని అతి కిరాతకంగా చంపారు. ఈ హత్య అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణ పూర్తి చేపట్టి ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇక ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News